India Post Payments Bank డిజిటల్ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఓపెన్ చేయండి!

by Disha Web Desk 17 |
India Post Payments Bank  డిజిటల్ అకౌంట్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా ఓపెన్ చేయండి!
X

దిశ, వెబ్‌డెస్క్: మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసు‌లో చాలా మార్పులు వస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడే విధంగా, సులభమైన పద్ధతిలో సేవలు అందించడానికి కొత్త కొత్త సదుపాయాలను తీసుకొస్తుంది. ఈ మధ్య డిజిటల్ లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల చాలా యాప్‌లు డిజిటల్ లావాదేవీల పెరుగుదలకు ఉపయోగపడుతున్నాయి. పోస్టాఫీసు కూడా కస్టమర్లకు సులభంగా సేవలు అందించడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)ని తీసుకొచ్చింది. దీని ద్వారా పోస్టాఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కేవలం యాప్ ద్వారా డిజిటల్‌గా పొదుపు ఖాతాను ఓపెన్ చేసే అవకాశాన్ని అందిస్తుంది.

లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా IPPB మొబైల్ యాప్‌ సహాయంతో ప్రాథమిక బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించవచ్చు. ఈ యాప్ ద్వారా బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు, నగదును ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి ఖాతా (SSA), పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వంటి పథకాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీంతో పాటు రూ.10 లక్షలు అందించే యాక్సిడెంట్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను కూడా పొందవచ్చు.

18 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులు ఎవరైనా IPPB డిజిటల్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. ముఖ్యంగా ఖాతా తెరిచిన 12 నెలలలోపు e-kyc ని పూర్తి చేయాలి. లేకపోతే ఖాతాను రద్దు చేస్తారు. e-kyc కోసం దగ్గరలోని పోస్టాఫీసు లేదా పోస్ట్‌మెన్‌ను సంప్రదించవచ్చు. 12 నెలలలోపు e-kyc పూర్తి చేస్తే డిజిటల్ పొదుపు ఖాతాను పోస్టాఫీసు పొదుపు ఖాతాకు అనుసంధానిస్తారు.

IPPB ఖాతా వల్ల ఉపయోగాలు..

* జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభించవచ్చు.

* రూపే వర్చ్యువల్ కార్డును జారీ చేస్తారు.

* బిల్లు చెల్లింపులు, రీచార్జ్‌లను యాప్ ద్వారా చేయవచ్చు.

* బ్యాంకు స్టేట్‌మెంట్ ఉచితంగా లభిస్తాయి.

IPPB ఖాతాను ఇలా ఓపెన్ చేయండి..

* ముందుగా ఫోన్‌లో IPPB యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.

* మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌కి వెళ్లి, 'ఓపెన్ అకౌంట్'పై క్లిక్ చేయాలి.

* పాన్ కార్డు నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.

* ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.

* అడ్రస్, నామీని ఇతర వివరాలు ఎంటర్ చేయడం ద్వారా ఖాతా ఓపెన్ అవుతుంది.

ఈ ప్రాసెస్ కాకుండా నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి అధికారులను సంప్రదిస్తే వారు ఖాతాను ఓపెన్ చేసి, మీ e-kycని అక్కడే పూర్తి చేస్తారు.

Also Read.

రూ. 2 వేల నోట్ల ఉపసంహరణతో పెరగనున్న వినియోగం: SBI రీసెర్చ్!

రుణ గ్రహీతలకు ఎస్​బీఐ అదిరే ఆఫర్స్​

Next Story

Most Viewed