4K రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీలను విడుదల చేసిన Xiaomi

by Harish |
4K రిజల్యూషన్‌తో స్మార్ట్ టీవీలను విడుదల చేసిన Xiaomi
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ Xiaomi స్మార్ట్ టీవీ మార్కెట్‌లో మెజారిటీ వాటా దక్కించుకొడానికి కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇండియా మార్కెట్లో X సిరీస్‌లో భాగంగా స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్‌లలో లభించనుంది. ఇది వరుసగా 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు. అన్నిమోడల్ టీవీలు కూడా Android 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి.




స్మార్ట్ టీవీ X సిరీస్ క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతాయి. ఇవి 2GB RAM, 8GB మెమరీతో వస్తున్నాయి. మూడు టీవీలు 4K రిజల్యూషన్ (3840 x 2160p) కలిగి ఉన్నాయి. అత్యుత్తమైన సౌండ్ కోసం డాల్బీ విజన్ సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి. ఇవి HDR10, HLGకి సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్ టీవీ వివిధ రకాల కంటెంట్‌లు.. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ మొదలగు వాటిని అందిస్తుంది.


కనెక్టివిటీ పరంగా, Xiaomi స్మార్ట్ TV X సిరీస్ బ్లూటూత్ 5.0, 3 HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు, ఈథర్‌నెట్ పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, 3.5mm ఆడియో జాక్‌లను కలిగి ఉంది. అన్ని టీవీలు 30W స్పీకర్లను కలిగి ఉంటాయి. Xiaomi Smart TV X 43-అంగుళాల వేరియంట్ ధర రూ. 28,999. 50 అంగుళాల మోడల్ ధర రూ. 34,999. 55-అంగుళాల మోడల్ ధర రూ. 39,999. టీవీలు సెప్టెంబర్ 14 నుండి Mi.com, Mi Homes, Flipkart ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటాయి.

Next Story

Most Viewed