PLFS: పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళలు

by S Gopi |

ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో ఎక్కువగా పుంజుకుంది.

PLFS: పురుషుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న మహిళలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వం విడుదల చేసిన తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం, గతేడాది అనేక ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళల సంపాదన వేగంగా పెరిగిందని తెలిపింది. ఇదే సమయంలో, మనదేశ జాబ్ మార్కెట్‌లో తీవ్రమైన జెండర్ పే గ్యాప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (మోస్పి) ఇచ్చిన డేటా ప్రకారం, మహిళల ఆదాయాలు వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో ఎక్కువగా పుంజుకుంది. కానీ, మహిళలు ఇప్పటికీ పురుషుల కంటే చాలా తక్కువ సంపాదిస్తున్నారు. ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. సమీక్షించిన ఏడాదిలో పురుషుల వేతనం 5.8 శాతంతో పోలిస్తే మహిళల జీతాలు 7.2 శాతం పెరిగాయి. స్వయం ఉపాధి విభాగంలో పురుసుహులు 8 శాతం, మహిళలు 8.8 శాతం ఎక్కువ జీతాలు అందుకున్నారు. సాధారణ లేబర్ విభాగంలో మహిళల ఆదాయం 5.4 శాతం పెరిగితే, పురుషుల ఆదాయం 0.2 శాతం తగ్గాయి. ఈ గణాంకాలు మహిళల సంపాదన వేగంలో క్రమంగా మెరుగుదల కనిపిస్తోంది, ముఖ్యంగా అసంఘటిత రంగం ఆధిపత్యం చెలాయించే విభాగాల్లోను ఈ మార్పు స్పష్టంగా ఉందని నివేదిక పేర్కొంది.

Next Story