GOOD NEWS: తులం బంగారం రూ. 55 వేలకు దిగనుందా..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?

by Kodari Anjali |   (  Updated:2025-04-02 06:50:37  IST  )

ప్రస్తుతం బంగారం ధరలు రికార్డు స్థాయిలో మోత మోగుతున్నాయి.

GOOD NEWS: తులం బంగారం రూ. 55 వేలకు దిగనుందా..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం బంగారం ధరలు (Gold prices) రికార్డు స్థాయిలో మోత మోగుతున్నాయి. సామాన్య ప్రజలు గోల్డ్ అవసరమున్న కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. బంగారం ధరలు ఓ వైపు తగ్గినట్లే తగ్గి.. మధ్యాహ్నం, సాయంత్రం వరకు కొండెక్కి కూర్చుంటున్నాయి. దీంతో జనాలు గోల్డ్ కొందామంటే జంకుతున్నారు. మొన్నటివరకు రూ. 80 వేల మార్కును అధిగమించగా.. ఇప్పుడు ఏకంగా 24 క్యారెట్లు.. 10 గ్రాముల బంగారానికే ఏకంగా రూ. 92,840 గా ఉంది. రోజురోజుకు పెరుగుతోంది తప్ప తగ్గుముఖం పట్టట్లేదు. అటు అంతర్జాతీయ మార్కెట్‌ (International market)లో కూడా గోల్డ్ రేట్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి.

అయితే ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఓ తీపికబురు అందింది. రానున్న కాలంలో పది గ్రాముల పసిడి ధర ఏకంగా 55 వేల రూపాయలకు దిగనుందట. మరీ ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారట. అయితే గతంలో లావాదేవీలు పెరిగిన సందర్భాలున్నాయి. 2024లో బంగారు పరిశ్రమ లావాదేవీలు (Gold industry transactions) ఏకంగా 32% పెరిగాయి. ఆ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

మనీ కంట్రోల్ ప్రకారం.. అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మార్నింగ్‌స్టార్ (American financial services company Morningstar) విశ్లేషకుడు జాన్ మిల్స్ (John Mills)ప్రకారం.. ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు US$1,820కు తగ్గవచ్చని అంటున్నారు. ఇది ప్రస్తుత ఔన్సు ధర $3,080 నుంచి గణనీయమైన తగ్గుదల అవుతుంది. ఇది కనుక నిజమైతే ఇండియాలో గోల్డ్ రేట్లు కూడా 10 గ్రాములకు రూ. 55,496 కి తగ్గవచ్చు.

మీల్స్ అంచనా ప్రకారం బంగారం ధరలు 38 శాతం తగ్గుతాయి. మరీ రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ నిజంగానే తగ్గుతాయో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం, ప్రపంచ అస్థిరత, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ధరలు ఎంతకాలం ఉంటాయనే దానిపై నిపుణులు చర్చలు కొనసాగించారు.

Next Story