- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SIP: సంపద సృష్టికి స్టెప్-అప్ సిప్ అద్భుతమైన మార్గం
సాధారణ సిప్ వల్ల వెనకేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఆదాయంతో పాటు పెట్టుబడులను కూడా క్రమంగా పెంచుకునే మార్గాలున్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: లేటు వయసులో, పదవీ విరమణ సమయానికి ఎక్కువ మొత్తం చేయాలని భావిస్తున్నారా? కొంత వయసు వచ్చాక అవసరాలకు, వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకూడదంటే సరైన ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. ముఖ్యంగా ద్రవ్యోల్బణ ప్రభావం రోజువారీ ఖర్చులపై పడకుండా ఉండాలంటే, స్థిరమైన పెట్టుబడి మాత్రమే సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం సాధారణంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) సరైన నిర్ణయమే అయినప్పటికీ, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల్లో సాధారణ సిప్ కంటే స్టెప్-అప్ సిప్‌లు అత్యంత లాభదాయకమని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుత తరానికి గతంలో కంటే ఎక్కువ పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. మన ముందు తరం వారికి స్థిరాస్తి, బంగారం వంటి కొన్ని సాధనాలే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ముఖ్యంగా సిప్‌ల ద్వారా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేసే మార్గాలు భారీగా పెరిగాయి. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయితే, కేవలం సాధారణ సిప్ వల్ల భవిష్యత్తులో అనుకున్న విధంగా వెనకేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఆదాయంతో పాటు పెట్టుబడులను కూడా క్రమంగా పెంచుకునే మార్గాలున్నాయి. ఇందుకు స్టెప్-అప్ సిప్ అనే మార్గం ఎక్కువ సంపద సృష్టికి వీలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో స్టెప్-అప్ సిప్ వల్ల ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
సాధారణంగా చేసే సిప్ విధానంలో కొంత మొత్తం నిర్ణయించి, నెలవారీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రతి సంవత్సరం పెరిగే ఆదాయం, ఖర్చులకు అనుగుణంగా కొంతమొత్తాన్ని పెట్టుబడులను పెంచడమే స్టెప్-అప్ సిప్. పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఇది ఎంతైనా పెంచుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్తు అవసరాలకు సరిపోయేలా సొమ్మును సమకూర్చుకోవచ్చు. ప్రధానంగా పదవీ విరమణ లేదా పిల్లల విద్య కోసం నిధులు సర్దుబాటు చేసుకోవడం సులభంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ప్రారంభించి కొన్నేళ్ల తర్వాత అధిక సంపదను ఏర్పాటు చేసుకోవచ్చు.
సిప్ వర్సెస్ స్టెప్-అప్ సిప్ మధ్య వ్యత్యాసం
సాంప్రదాయ సిప్ విధానం ద్వారా మ్యూచువల్ ఫండ్లలో క్రమం తప్పకుండా అంటే నెలవారీగా కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. ఈ విధానం వల్ల పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఉదాహరణకు, 12 శాతం వార్షిక రాబడితో 15 ఏళ్లలో రూ. 5,000 నెలవారీ సిప్‌ని ఎంచుకుంటే, మొత్తం పెట్టుబడి రూ. 9 లక్షలు అవుతుంది. ఇది కాంపౌండింగ్ పవర్ ద్వారా దాదాపు రూ. 24 లక్షల మెచ్యూరిటీ విలువకు చేరుతుంది.
అదే స్టెప్-అప్ సిప్ పెట్టుబడిని ఎంపిక చేసుకుంటే, ప్రతి సంవత్సరం నెలవారీ పెట్టుబడిని కొంత శాతంతో (ఉదాహరణకు 10 శాతం) పెంచుకోవచ్చు. దీని అర్థం, చిన్న మొత్తంతో సిప్‌ని ప్రారంభించినప్పటికీ, ఆదాయం పెరిగే కొద్దీ పెట్టుబడి పెరుగుతుంది. తద్వారా డబ్బు చాలా వేగంగా పెరుగుతుంది. ఉదాహరణకు, నెలకు రూ. 5,000తో సిప్‌ని ప్రారంభించి, ప్రతి సంవత్సరం 10 శాతం పెంచినపుడు, 15 ఏళ్లకు పెట్టే పెట్టుబడి మొత్తం రూ. 15.3 లక్షలు అవుతుంది. ఇది కాంపౌండింగ్ పవర్ ద్వారా దాదాపు రూ. 36 లక్షలకు చేరుతుంది.
ఇది సాధారణ సిప్‌లో లభించే రూ. 12 లక్షల కంటే చాలా ఎక్కువ. ఇది కేవలం ప్రతి సంవత్సరం కొంత శాతం పెంచడం ద్వారా లభిస్తుంది.
రూ. 5,000తో ప్రారంభించి ప్రతి సంవత్సరం 10 శాతం పెంచండి - 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 15.3 లక్షలకు పెరుగుతుంది.
ఎందుకు స్టెప్-అప్ సిప్ లాభదాయకం?
ప్రతి సంవత్సరం చిన్న మొత్తం పెంచడం వల్లే కాలక్రమంలో భారీ సంపదను సృష్టించవచ్చు. దీన్ని మరో ఉదాహరణ ద్వారా చెప్పాలంటే, నెలకు రూ. 10,000తో సిప్‌ను ప్రారంభించాం అనుకుందాం. ప్రతి సంవత్సరం 15 శాతం వార్షిక రాబడి, 10 శాతం స్టెప్-అప్ సిప్ ఎంచుకుంటే, 15 ఏళ్లలో రూ. కోటి, 21 ఏళ్లలో రూ. 3 కోట్లు, 29 ఏళ్లలో రూ. 10 కోట్లు, 30 ఏళ్లలో రూ. 88 లక్షల పెట్టుబడికి రూ. 11.12 కోట్లు అవుతుంది. దీనివల్ల మొత్తం సంపదలో సుమారు 90 శాతం చక్రవడ్డీ ద్వారా వస్తుంది.
ఎవరికి ప్రయోజనమంటే..
ఈ రకమైన స్టెప్-అప్‌ను చిన్న వయసులో చేరినవారికి మంచి లాభాలను అందిస్తుంది. దీనికోసం చిన్న మొత్తంతో ప్రారంభించాలి. జీతం పెరిగే కొద్దీ సిప్‌ని పెంచుకోవాలి. భవిష్యత్తు భారీ సంపద సృష్టికి ఇది ఉత్తమమైన మార్గం.
అలాగే, ఆలస్యంగా పెట్టుబడులు మొదలుపెట్టేవారికి (40 లేదా 50 ఏళ్ల వయసులో) ఇది లాభదాయకమే. పెట్టుబడి పెట్టడానికి తక్కువ సమయం ఉన్నప్పటికీ స్టెప్-అప్ సిప్ సంపదను వేగంగా పెంచుకునేందుకు సహాయపడుతుంది. ఉదాహరణకు, 45 ఏళ్ల వయసులో నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడుతూ, ఏటా 15 శాతం పెంచుకుంటూ వెళితే, 15 ఏళ్లలో రూ. 90 లక్షలు కూడబెట్టవచ్చు. ఇది స్థిరమైన సిప్ కంటే చాలా ఎక్కువ.
కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారికి కూడా ఈ రకమైన పెట్టుబడి విధానం ఎక్కువ లాభాలను అందిస్తుంది. అయితే, వీరు మొదట్లో పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టకపోయినా, స్టెప్-అప్ ద్వారా నెమ్మదిగా, సులభంగా సంపదను పెంచడంలో సహాయపడుతుంది. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో నెలకు రూ. 5,000తో సిప్‌ని ప్రారంభించి, ఏటా 10 శాతం పెంచితే, పదవీ విరమణ నాటికి రూ. 9.37 కోట్లను పొందవచ్చు.






