- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్న పెరిగి, నేడు తగ్గి.. బంగారం, వెండి ధరల్లో ఎందుకీ ఊగిసలాట?
బంగారం, వెండి ధరల్లో ఎందుకీ ఊగిసలాట జరుగుతోంది. ఒకరోజు పెరిగి, మరో రోజు తగ్గి.. కొనుగోలుదారులను ఎందుకు అయోమయానికి గురిచేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేడు ఆల్ మోస్ట్ అంతేరీతిలో తగ్గాయి. గురువారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2340 తగ్గి రూ.1,51,480కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,150 తగ్గి రూ.1,38,850 వద్ద కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.5000 తగ్గి రూ.2,60,000 వద్ద స్థిరపడింది. లైవ్ ట్రేడింగ్ ను బట్టి ఈ ధరల్లో మార్పులుండవచ్చు. పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్న సమయంలో బంగారం, వెండి ధరలు ఇలా పెరుగుతూ, తగ్గుతూ ఊగిసలాడుతుండటంతో ఎప్పుడు కొనాలో, ఎప్పుడు ఆగాలో తెలియక కొనుగోలుదారులు అయోమయానికి గురవుతున్నారు. దీనికి కారణం ఏంటి?
నిన్న 24 క్యారెట్ల బంగారం, 22 క్యారెట్ల బంగారం ధరల ఏకంగా మూడున్నర వేల రూపాయలకు పైగా పెరిగింది. ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకున్నారు. దీంతో నేడు బంగారం ధర తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. బంగారంపై పెట్టుబడులు పెరిగితే ధర పెరుగుతుందని, లాభాలు తీసుకుంటే ధర తగ్గుతుందని చెప్తున్నారు. అంతేకాదు.. డాలర్ బలపడినా, బలహీన పడినా బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. మరోవైపు ట్రంప్.. ఇరాన్ పై యుద్ధం విషయంలో రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. సీజ్ ఫైర్ ను మరో రెండువారాలకు పెంచిన ట్రంప్.. ఈ రోజు మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ ఒక్క తప్పు చేసినా మళ్లీ యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు. ట్రంప్ చేసే వ్యాఖ్యలతో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. నష్టాలు ఎక్కడ ముంచేస్తాయోనన్న ఆందోళన వారిని ప్రాఫిట్స్ వైపు మళ్లిస్తోంది. ప్రస్తుతానికైతే పశ్చిమాసియా యుద్ధంపైనే బంగారం, వెండి ధరలు ఆధారపడి ఉన్నాయి.






