- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Price: పాకిస్తాన్‌లో బంగారం ధర ఎంత? ఇండియా కంటే చీప్ గా దొరుకుతుందా?
Gold Price India Vs Pakisatan: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Gold Price India Vs Pakisatan: దేశీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తులం బంగారం ధర 96వేలపైనే కొనసాగుతోంది. రానున్న రోజుల్లో లక్ష రూపాయలు దాటుతుందని నిపుణులు చెబుతున్నాయి. అయితే మన దాయాది దేశం పాకిస్తాన్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎందుకంటే పాకిస్తాన్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.
ఈనేపథ్యంలోనే అక్కడ బంగారం ధరలు..భారత్ కంటే తక్కువ ధరకు లభిస్తాయా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సమా టీవీ రిపోర్టు ప్రకారం పాకిస్తాన్ లో 24క్యారెట్ల బంగారం ధర ఒక టోలా (సుమారు 11.66 గ్రాములు) బంగారం ఇప్పుడు అక్కడ 340,600 పాకిస్తానీ రూపాయలకు అందుబాటులో ఉంది. అంటే 1,800 పాకిస్తానీ రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 1,543 పాకిస్తానీ రూపాయలు పెరిగి 292,009 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది.
ఒక టోలా (సుమారు 11.66 గ్రాములు) పాకిస్తానీ బంగారం భారత రూపాయలలో దాదాపు రూ.1,04,506 అవుతుంది. అయితే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర భారత రూపాయలలో రూ.89,597 కు సమానం.పాకిస్తాన్, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధరలను పోల్చి చూస్తే, పాకిస్తాన్‌లో 10 గ్రాముల బంగారం ధర భారత రూపాయలలో సుమారు రూ. 89,597, అయితే భారతదేశంలో 10గ్రాములు రూ. 95,560 కు లభిస్తుంది. అంటే భారతదేశం కంటే పాకిస్తాన్‌లో బంగారం కొంచెం చౌకగా ఉంటుందని చెప్పవచ్చు. భారత రూపాయిని పాకిస్తానీ రూపాయితో పోల్చినట్లయితే, పాకిస్తాన్‌లో 1 భారత రూపాయి దాదాపు 4 పాకిస్తానీ రూపాయలకు సమానం.






