- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య పేరు మీదా ఆస్తి ఉంటే ఎంత లభమో తెలుసా.. తెలుసుకుంటే షాక్ అవుతారు
దిశ, వెబ్ డెస్క్ : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చాలా మంది సొంతింటి కోసం డబ్బును ఆదా చేస్తుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. చాలా మంది సొంతింటి కోసం డబ్బును ఆదా చేస్తుంటారు. అప్పుడే వారి తమ కోసం ఇల్లును కొనుగోలు చేయగలుగుతారు. మీరు మీకోసం కొత్త ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ వార్త మీకోసం. మీరు మీ భార్య పేరు మీద ఇల్లు కొనడం వల్ల మీరు ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో తెలుసుకుందాం.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సమాజంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలకు అనేక విషయాల్లో రాయితీలను అందిస్తోంది. మహిళలు ఆస్తి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనేక నియమాలను రూపొందించింది. ఆస్తి పన్నులో మహిళలకు ప్రత్యేక మినహాయింపు కూడా ఇస్తున్నారు. అందుకే మీరు కూడా మీ కోసం ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు దానిని మీ భార్య పేరు మీద కొనుగోలు చేయవచ్చు. అది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది.
మీరు ఆస్తిని కొనుగోలు చేస్తుంటే...దానిని మీ భార్య పేరుతో మాత్రమే కొనడం మంచిది. ఇది మీకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు లోన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. భారత్ లో పురుషుల కంటే తక్కువ వడ్డీ రేట్లకు మహిళకు లోన్స్ అందించే అనేక బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి.
ఎవరైనా ఇల్లు కొన్నప్పుడు ఆ ఇల్లు కొనే సమయంలో చాలా కాగితపు పనులు చేయాల్సి ఉంటుంది. మీరు ఇంటిని రిజిస్టర్ చేయించుకోవాలి. దీనికోసం స్టాంప్ డ్యూటీ చెల్లించాలి. మీ డబ్బులో ఎక్కువ భాగం స్టాంప్ డ్యూటీకి కూడా ఖర్చు అవుతుంది. కానీ భారతదేశంలో పురుషుల కంటే మహిళలు తక్కువ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి.
మహిళలకు ఆస్తి సంబంధిత పన్నులపై కూడా మినహాయింపు లభిస్తుంది. ఈ మినహాయింపును మున్సిపల్ కార్పొరేషన్ మహిళలకు ఇస్తుంది. అయితే ఆస్తి మహిళ పేరు మీద ఉంటేనే మీకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఒక మహిళ పేరు మీద ఆస్తి ఉంటే అది ఆమె ఆర్థిక భద్రతను బలపరుస్తుంది. ఆమె స్వావలంబన పొందుతుంది. అందువల్ల ఆమె పూర్తి స్వేచ్ఛతో ఏ నిర్ణయమైన తీసుకోవచ్చు.






