అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ.. LICకి రూ.70,000 కోట్ల నష్టం!

by Kema Shiva Kumar |

అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో ఎల్‌ఐసీ (LIC) పెట్టుబడుల విలువ రూ. 70,000 కోట్లు తగ్గింది.

అమెరికా-ఇరాన్ యుద్ధం దెబ్బ.. LICకి రూ.70,000 కోట్ల నష్టం!
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం భారత స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీగా నష్టపోయింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఎల్‌ఐసీ ఇన్వెస్ట్ చేసిన షేర్ల విలువ దాదాపు రూ.70,000 కోట్లు మేర ఆవిరైపోయింది. అయితే, ఎల్‌ఐసీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్న SBI, HDFC, ICICI బ్యాంక్ స్టాక్స్ క్రాష్ అవడం, ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ లార్సెన్ & టూబ్రో (L&T) షేర్లు ఈ సంక్షోభంతో అత్యధికంగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు భయాందోళనలకు గురై షేర్లను విక్రయించడంతో మార్కెట్ విలువ భారీగా పడిపోయింది.

మార్చి 10 నాటి నివేదిక ప్రకారం.. ఎల్‌ఐసీకి వివిధ కంపెనీల్లో ఉన్న వాటాల మార్కెట్ విలువ గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా బ్లూ-చిప్ కంపెనీల షేర్లు పతనం కావడమే ఈ భారీ నష్టానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రతికూల ప్రభావం స్టాక్ మార్కెట్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఎల్‌ఐసీ పోర్ట్‌ఫోలియో విలువ తగ్గడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.

Next Story