హైదరాబాద్‌లో ఆగని పసిడి పరుగు.. వరుసగా మూడో రోజు పెరిగిన ధరలు

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో వరుసగా 3వ రోజూ పెరిగిన బంగారం ధరలు! 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,55,570. మూడు రోజుల్లోనే రూ.3,110 పెరుగుదల.

హైదరాబాద్‌లో ఆగని పసిడి పరుగు.. వరుసగా మూడో రోజు పెరిగిన ధరలు
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ధరలు పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ.. పై పైకి పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా పెరిగిన డిమాండ్ నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లోనే తులం బంగారంపై మూడు వేల రూపాయలకు పైగా పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

నేటి ధరల వివరాలు

ఈ రోజు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నేడు రూ.220 పెరగడంతో, తులం బంగారం ధర రూ.1,55,570 కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.200 పెరిగింది దీంతో దీని ధర రూ.1,42,600 గా నమోదైంది. గత మూడు రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొత్తంగా ఈ మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై రూ.3,110 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం రూ.2,850 మేర ధర పెరిగింది. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు మరియు స్టాక్ మార్కెట్లలోని అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతుండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో సామాన్య ప్రజలపై ఈ ధరల భారం మరింత పడే అవకాశం ఉంది.

Next Story