- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India: దేశంలోని మూడింట రెండు వంతుల సంపద టాప్-10 శాతం వద్దే
మొదటి 1 శాతం మంది దేశ సంపదలో 40 శాతం సంపదను కలిగి ఉన్నారని స్పష్టం చేస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని సంపన్నులు మరింత సంపదను పోగు చేసుకుంటున్నారు. బుధవారం విడుదలైన తాజా ప్రపంచ అసమానత నివేదిక ప్రకారం, భారత్‌లో సంపద అసమానత ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ధనవంతులైన 10 శాతం మంది 65 శాతం వాటాను సొంతం చేసుకున్నారు. దిగువన 50 శాతం మంది కేవలం 6.4 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఆర్థికవేత్తలు లూకాస్ చాన్సెల్, రికార్డో గోమెజ్-కారెరా, రోవైడా మోష్రిఫ్, థామస్ పికెట్టీ సంపాదకీయంలో రూపొందిన ఈ నివేదిక భారతీయులలో మొదటి 1 శాతం మంది దేశ సంపదలో 40 శాతం సంపదను కలిగి ఉన్నారని స్పష్టం చేస్తోంది. ఆదాయ అసమానతలో టాప్-10 శాతం మంది జాతీయ ఆదాయంలో 58 శాతాన్ని సొంతం చేసుకోగా, దిగువన ఉన్న 50 శాతం మంది 15 శాతం సంప్దను మాత్రమే నిర్వహిస్తున్నారని నివేదిక పేర్కొంది. మొత్తంగా భారత్‌లో అసమానత అనేది ఆదాయం, సంపద, లింగ విభాగాల్లో లోతుగా పాతుకుపోయింది, ఇది ఆర్థికవ్యవస్థలో నిరంతర నిర్మాణాత్మక విభజనలకు కారణమవుతోందని నివేదిక అభిప్రాయపడింది.
భారత్‌లో సగటు తలసరి వార్షిక ఆదాయం దాదాపు రూ. 6.49 లక్షలు, సగటు సంపద దాదాపు రూ. 29.32 లక్షలు ఉంది. అయితే మహిళా కార్మిక భాగస్వామ్యం 15.7 శాతంతో తక్కువగా ఉంది, ఇది గత దశాబ్ద కాలంలో ఎలాంటి మార్పు లేదని నివేదిక పేర్కొంది. చారిత్రక దృక్పథాన్ని తీసుకుంటే, 1980లో జాతీయ ఆదాయ వాటాలో 40 శాతం ఎక్కువ జనాభా వద్ద ఉందని, కానీ నేడు దాదాపు అందరూ దిగువన ఉన్న 50 శాతంలో ఉన్నారని నివేదిక పేర్కొంది.






