- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TRAI: వాయిస్-ఎస్సెమ్మెస్ టారిఫ్ ప్లాన్‌లు తేవాలని ట్రాయ్ ప్రతిపాదన
by S Gopi |
వాయిస్, ఎస్సెమ్మెస్, డేటా ఉన్న స్పెషల్ టార్ఫి వోచర్(ఎస్‌టీవీ) మాదిరిగానే అదే వ్యాలిడిటీ వ్యవధితో, కేవలం వాయిస్, ఎస్సెమ్మెస్ కోసం మాత్రమే ప్రత్యేక టారిఫ్ వోచర్‌లను అందించాలని కోరింది.

X
దిశ, బిజినెస్ బ్యూరో: టెలికాం నియంత్రణ సంస్థ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మంగళవారం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. వాయిస్, ఎస్సెమ్మెస్, డేటా ఉన్న స్పెషల్ టార్ఫి వోచర్(ఎస్‌టీవీ) మాదిరిగానే అదే వ్యాలిడిటీ వ్యవధితో, కేవలం వాయిస్, ఎస్సెమ్మెస్ కోసం మాత్రమే ప్రత్యేక టారిఫ్ వోచర్‌లను అందించాలని కోరింది. డేటాతో కూడిన ఎస్‌టీవీలతో పోలిస్తే, కేవలం వాయిస్-ఎస్సెమ్మెస్ మాత్రమే ఉన్న ఎస్‌టీవీల ధరలు దామాషా ప్రకారం తక్కువగా ఉండాలని స్పష్టం చేసింది. దీనిపై అభిప్రాయాలు తెలియజేసేందుకు ఏప్రిల్ 28 వరకు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. టెలికాం కంపెనీలు వివిధ వ్యాలిడిటీ వ్యవధులలో ఎస్‌టీవీలను అందించడం లేదని, దీనివల్ల డేటా అవసరం లేని వినియోగదారులకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని ట్రాయ్ భావిస్తోంది.
Next Story






