- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Petrol Diesel Prices(March 04): తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!
కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.

దిశ,వెబ్‌డెస్క్: పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో పెట్రోల్ బంకులకు జనం క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం పెట్రోల్ ధరల పెంపు పై క్లారిటీ ఇచ్చింది. భారతదేశంలో ప్రస్తుతం ముడి చమురు, శుద్ధి చేసిన ఇంధన నిల్వలు దాదాపు 45 రోజులకు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధనం ధరలు పెంచడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. గత నెల(ఫిబ్రవరి)లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవనే విషయం తెలిసిందే. ఇక, ఈ నెల(మార్చి)లో ధరల్లో మార్పులు జరిగి రేట్లు తగ్గుతాయని వాహనదారులు ఆశ పడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు(మార్చి 04) పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్
లీటర్ పెట్రోల్ ధర:రూ.107.46
లీటర్ డీజిల్ ధర:రూ.95.37
వరంగల్
లీటర్ పెట్రోల్ ధర:రూ.107.12
లీటర్ డీజిల్ ధర:రూ.95.37
విశాఖపట్నం
లీటర్ పెట్రోల్ ధర:రూ.108.35
లీటర్ డీజిల్ ధర: రూ.96.22
విజయవాడ
లీటర్ పెట్రోల్ ధర:రూ.109.37
లీటర్ డీజిల్ ధర:రూ.97.22






