వెండి ధర షాకింగ్ పెరుగుదల.. మూడు రోజుల్లోనే రూ. 9 వేలు జంప్

by Malleboina Mahesh |   (  Updated:2025-11-27 06:50:33  IST  )

గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి, కొనుగోలు దారులకు షాక్ ఇచ్చాయి.

వెండి ధర షాకింగ్ పెరుగుదల.. మూడు రోజుల్లోనే రూ. 9 వేలు జంప్
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగి, కొనుగోలు దారులకు షాక్ ఇచ్చాయి. ఒక కేజీ వెండి ధర ఒక్కరోజే ఏకంగా రూ. 4 వేలు పెరిగి, రూ. లక్షా 80 వేల మార్క్‌ను తాకింది. అంతకుముందు మూడు రోజుల్లోనే కేజీ వెండి ధర రూ. 9 వేలు మేర ఎగబాకడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది. పారిశ్రామిక డిమాండ్ పెరగడం, అంతర్జాతీయ ట్రెండ్‌లు అనుకూలించడం వంటి కారణాల వల్ల వెండికి డిమాండ్ పెరిగి ధరలు ఈ స్థాయిలో దూసుకెళ్లాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

. కాగా, వెండి ధరలు పెరిగినప్పటికీ, బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 27 వేల 750 వద్ద ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 17 వేల 100 వద్ద స్థిరపడింది. ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో విలువైన లోహాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నప్పటికీ, వెండి ధరల్లోని ఈ అనూహ్య, వేగవంతమైన పెరుగుదల మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

Next Story