బుల్లెట్ బైక్ ధర పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ధర ఎంతంటే!

by Disha Web Desk 17 |
బుల్లెట్ బైక్ ధర పెంచిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. ధర ఎంతంటే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది జనవరిలో లాంచ్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 మోడల్ ధరలను కంపెనీ పెంచింది. దీని మూడు వేరియంట్ల ధరలను దాదాపు రూ. 5,000 వరకు పెంచినట్లు కంపెనీ తెలిపింది. కొత్త ధరల ప్రకారం, ఎంట్రీ-లెవల్ ఆస్ట్రల్ వేరియంట్ ధర రూ. 3,54,398. ఇంటర్‌స్టెల్లార్ వేరియంట్ ధర రూ. 3,69,622. హై-ఎండ్ సెలెస్టియల్ ధర రూ.3,84,845కి అందుబాటులో ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650 మోడల్ 648cc ఇంజన్ కలిగి ఉంటుంది. ఎయిర్-ఆయిల్ కూలింగ్‌ సిస్టమ్‌ కూడా ఉంది. ఈ ఇంజన్ 7,250 rpm వద్ద 46 bhp శక్తిని, 5,650 rpm వద్ద గరిష్టంగా 52.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అమర్చారు. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 15.4 లీటర్లుగా ఉంది.








Next Story

Most Viewed