India GDP: దటీజ్ భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా..!!

by Vennela |

India GDP: ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది.

India GDP: దటీజ్ భారత్.. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన ఇండియా..!!
X

దిశ, వెబ్ డెస్క్: India GDP: ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న జపాన్ 5వ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. నీతిఅయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 4 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా..ముందు అమెరికా, చైనా, జర్మనీలు మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని సుబ్రమణ్యం అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి గణాంకాలను ఉటంకిస్తూ భారత్ ఇప్పుడు జపాన్ ను అధిగమించిందని నీతి అయోగ్ సీఈవో ధ్రువీకరించారు. అంతేకాదు 2.5 నుంచి 3ఏళ్లలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపారు.

2010లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ 10వ స్థానంలో ఉండేది. 2019లో బ్రిటన్ ను వెనక్కి నెట్టి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. 6ఏళ్లలోనే 4వ స్థానానికి ఎగబాకింది. 2026 దేశ ఆర్థిక ఏడాదికి దేశ నామమాత్రపు జీడీపీ దాదాపు 4,187.017 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎంఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ ఏప్రిల్ ఎడిషన్ నివేదిక తెలిపింది. ఇది జపాన్ జీడీపీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ 2025లో 6.2శాతం 2026లో 6.3శాతం వృద్ధి చెందుతుందని అంచనాులు తీసుకువచ్చింది.

వచ్చే రెండేళ్లలో భారత్ అత్యంత వేగంగా డెవలప్ చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. మొత్తం మీద చూస్తే..2025లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2.8 శాతం 2026లో 3.0శాతం ఉంటుందని ఐఎంఎఫ్ భావిస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతోందని దేశ జనాభా ఈ వ్రుద్ధికి దోహదపడుతుందని నీతి అయోగ్ సీఈవో తెలిపారు. వేగంగా అభివ్రుద్ధి చెందే దశకు చేరుకునేందుకు భారత్ రెడీగా ఉంది. గతంలో చాలా దేశాలు ఈ స్థితిలోనే ఉన్నాయి. భౌగోళిక, జనాభా పరంగా భారత్ కు రానున్న 25 నుంచి 30ళఏళ్లల్లో చాలా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజన్ డాక్యుమెంట్లు తయారు చేయాలని రాష్ట్రాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇక భారత వ్రుద్ధిలో ఇప్పటికే కనిపిస్తోందని సుబ్రమణ్యం అన్నారు.

Next Story