- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadhaar app: ఆధార్ కార్డుతో పనిలేదు...త్వరలోనే ఆధార్ క్యూఆర్ కోడ్ సిస్టం ప్రవేశపెట్టనున్న కేంద్రం..ఇది ఎలా పనిచేస్తుందంటే..?
Aadhaar app: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క చిన్న పనికి ఆధార్ కార్డును ప్రూఫ్ గా చూపించడం అనేది తప్పనిసరి అయిపోతోంది.

దిశ, వెబ్ డెస్క్: Aadhaar app: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క చిన్న పనికి ఆధార్ కార్డును ప్రూఫ్ గా చూపించడం అనేది తప్పనిసరి అయిపోతోంది. హోటల్లో రూమ్ బుక్ చేసుకోవడం దగ్గర నుంచి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకునే వరకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. ఇక సిమ్ కార్డులతో పాటు ఇతర అన్ని పనులకు ఆధార్ అనేది తప్పని సరి అయిపోయింది. ఆధార్ కార్డు ఎక్కడపడితే అక్కడ వాడితే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆధార్ అనేది మీ పూర్తి వివరాలను వారికి తెలియజేయడమే అని అర్థం ఇందులో బయోమెట్రిక్స్ కూడా ఉంటాయి. వీటిని సంఘవిద్రోహక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది కనుక, ఈ సమస్య నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్లాన్ ప్రారంభించింది.
ఇక నుండి ఫిజికల్ ఆధార్ కార్డు తో పని లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. ఎక్కడైనా సరే ఇక్కడి నుండి ఫిజికల్ ఆధార్ కార్డు తో పని లేకుండా చేయనుంది. అంతేకాదు జిరాక్స్ కాపీతో కూడా పని లేదన్నమాట.
ఎందుకంటే ప్రభుత్వం కొత్తగా ఆధార్ యాప్ ను కేంద్రం తీసుకురాబోతుంది. ఇది ఎలా పని చేస్తుందంటే, ఉదాహరణకు మనం షాపుల్లో ఎలాగైతే క్యూఆర్ కోడ్ వాడుతుంటామో అలాగే ఉంటుంది. యూపిఐ యాప్స్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి డబ్బులు పంపిస్తాం కదా సరిగ్గా అలానే అన్ని చోట్ల, భవిష్యత్తులో ఆధార్ క్యూఆర్ కోడ్ ఉంటుంది.
-ఉదాహరణకు హోటల్ లో రూం కోసం ఖచ్చితంగా ఆధార్ అడుగుతున్నారు. ఈ నేఫథ్యంలో ఈ క్యూఆర్ కోడ్ వల్ల మీరు సింపుల్ గా ఆధార్ యా ప్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే చాలు స్కాన్ చేసిన వెంటనే ఫేషియల్ రికగ్నిషన్ అడుగుతుంది.
- మన ఫేస్ ని చూపిస్తే చాలు వెరిఫికేషన్ అయిపోతుంది.
-ఎటువంటి సమాచారం మాత్రమే వాళ్ళకి తెలియజేయాలి అనుకుంటున్నారో దాన్ని మాత్రమే మీరు ఎంపిక చేసుకోవచ్చు. అంత సమాచారం మాత్రమే హోటల్ వాళ్ళకి వెళ్తుంది.
ఇన్ని రోజులు మనం ఫిజికల్ గా ఈ విధంగా కార్డు ని క్యారీ చేయాల్సి వచ్చేది లేదా ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి వచ్చేది. అలాగే సిమ్ కార్డ్స్ కొనేటప్పుడు కచ్చితంగా మనం జిరాక్స్ ఇచ్చేవాళ్ళం కానీ ఆ డేటాని వాళ్ళయితే అమ్మేసుకునేవారు. కానీ ఇక నుండి అలా జరగదు. ప్రతిసారి ఫిజికల్ కార్డ్ ని క్యారీ చేయాల్సిన అవసరం కూడా లేదు.






