- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICICI Bank: టీసీఎస్‌ను వెనక్కి నెట్టిన ఐసీఐసీఐ బ్యాంక్
గురువారం ప్రైవేట్ రంగ అతిపెద్ద ఐసీఐసీఐ బ్యాంక్ టీసీఎస్‌ను దాటి ఐదో స్థానం దక్కించుకుంది. దీంతో టీసీఎస్ ఆరో స్థానానికి పడిపోయింది

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. మార్కెట్ విలువ పరంగా దేశంలో అత్యంత విలువైన సంస్థల జాబితాలో టీఎస్‌ను ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ అధిగమించిన ఒకరోజులోనే మరో స్థానం కోల్పోయింది. గురువారం ప్రైవేట్ రంగ అతిపెద్ద ఐసీఐసీఐ బ్యాంక్ టీసీఎస్‌ను దాటి ఐదో స్థానం దక్కించుకుంది. దీంతో టీసీఎస్ ఆరో స్థానానికి పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, 2009, జూన్ తర్వాత మొదటిసారిగా ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్‌ను అధిగమించింది. సాయంత్రం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 10.21 లక్షల కోట్లు ఉండగా, టీసీఎస్ విలువ రూ. 9.96 లక్షల కోట్లకు చేరింది. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ ధర దాదాపు 22 శాతం పెరిగి రూ. 1,432కి చేరింది. ఇదే సమయంలో టీసీఎస్ షేర్ సుమారు 6 శాతం క్షీణించి రూ. 2,741.90 వద్ద ముగిసింది. ఇది 2020, డిసెంబర్ తర్వాత అత్యల్ప స్థాయి. బీఎస్ఈ డేటా ప్రకారం, ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 19.71 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో అత్యంత విలువైన సంస్థగా ఉంది. దీని తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(రూ. 14.19 లక్షల కోట్లు), భారతీ ఎయిర్‌టెల్(రూ. 11.51 లక్షల కోట్లు)తో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.






