- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCS: టీసీఎస్ ఘటనతో అలర్ట్ అయిన ఐటీ కంపెనీలు
ఈ ఘటన తర్వాత వేధింపులు, పని సంస్కృతిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ నాసిక్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఐటీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ ఘటన తర్వాత వేధింపులు, పని సంస్కృతిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు తమ అనుభవాలను పంచుకుంటూ అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా, తమ కంపెనీ ఆఫీస్ ప్యాంట్రీని 'ఫుట్‌వేర్-ఫ్రీ జోన్'గా ప్రకటించిందని ఎక్స్‌లో ఓ పోస్ట్ వైరల్ అయింది. ఆ పోస్టులో కంపెనీ ఆఫీస్ ప్యాంట్రీని 'ఫుట్‌వేర్-ఫ్రీ జోన్'గా ప్రకటించడం మతపరమైన పక్షపాతానికి ఉదాహరణ అని ఆరోపించారు. అయితే, దీన్ని కంపెనీ ఖండించింది. ఆ ఫోటో తమ ఆఫీస్‌కి సంబంధించింది కాదని, సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం అవాస్తవమని కంపెనీ స్పష్టం చేసింది. తమ సంస్థలో మతంతో పాటు ఎలాంటి వివక్షకు చోటు లేదని, ప్రతి ఉద్యోగిని గౌరవంగా, సమానంగా చూసే వాతావరణం ఉందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
మరో సందర్భంలో ఇన్ఫోసిస్ కూడా వేధింపులు, వివక్ష పట్ల కంపెనీలో జీరో టోలరెన్స్ విధానాన్ని పాటిస్తున్నామని ప్రకటించింది. అయినప్పటికీ, కొన్ని సంస్థల్లో ఉద్యోగులు వేధింపుల గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు పూర్తిగా తగ్గాలంటే ఫిర్యాదుల వ్యవస్థలను బలోపేతం చేయాలని హెచ్ఆర్ నిపుణులు సూచిస్తున్నారు. కంపెనీల్లో రూల్స్ ఉన్నా, ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. ప్రతీకార చర్యలు, న్యాయం జరగదేమోననే సందేహాలు వారిని వెంటాడుతున్నాయి. ఫిర్యాదులపై విచారణలో పారదర్శకత ఉండాలని, ఉద్యోగులు భయపడకుండా ముందుకు వచ్చేందుకు అనుకూల వాతావరణం కల్పించాలని పేర్కొంటున్నారు.






