TCS: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ జీతం రూ. 28 కోట్లు

by S Gopi |

ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం రూ. 26.5 కోట్ల కంటే 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

TCS: టీసీఎస్ సీఈఓ కృతివాసన్ జీతం రూ. 28 కోట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ, ఎండీ కె. కృతివాసన్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 28.1 కోట్ల పారితోషికం అందుకున్నారు. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం రూ. 26.5 కోట్ల కంటే 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, గతేడాది ఆయన మొత్తం జీతంలో రూ. 1.67 కోట్ల మూల వేతనం, 1.43 కోట్ల అలవెన్సులు, అదనపు సౌకర్యాలు ఉండగా, కమీషన్ రూపంలోనే రూ. 25 కోట్లు అందుకున్నారు. టీసీఎస్ ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే సీఈఓ పే 332.8 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. ఇదే సమయంలో, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తి సుబ్రమణియన్ మొత్తం రూ. 18.3 కోట్ల వేతనం తీసుకుంటున్నారు. ఇక కంపెనీలో జూనియర్, మిడ్-లెవల్ ఉద్యోగులకు 4.5 నుంచి 7 శాతం వరకు ఇంక్రిమెంట్లు ఇవ్వగా, అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి డబుల్ డిజిట్ హైక్స్ ఇచ్చారు. విదేశీ ఉద్యోగులకు 1 నుంచి 6 శాతం మధ్య వేతన పెంపు లభించింది. ప్రమోషన్లు, ఇతర సవరణలు కలిపి చూస్తే మొత్తం పే హైక్ 5-8 శాతం మధ్యలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

Next Story