మొట్టమొదటి సీఎన్‌జీ ఆటోమెటిక్ కార్లను విడుదల చేసిన టాటా మోటార్స్

by Dishanational1 |
మొట్టమొదటి సీఎన్‌జీ ఆటోమెటిక్ కార్లను విడుదల చేసిన టాటా మోటార్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ మొట్టమొదటి సీఎన్‌జీ ఆటోమెటిక్ కార్లను విడుదల చేసింది. టాటాకు చెందిన టియాగో, టిగోర్ ఐసీఎన్‌జీ మోడళ్లలో ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చింది. టియాగో సీఎన్‌జీ ఆటోమెటిక్ ధర రూ. 7.90 లక్షల నుంచి రూ. 8.80 లక్షల మధ్య ఉంటుందని, టిగోర్ ఐసీఎన్‌జీ రెండు వేరియంట్లలో లభిస్తుండగా, దీని ధర రూ. 8.85 లక్షల నుంచి రూ. 9.55 లక్షల మధ్య లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కార్లను కొనుగోలు చేయాలని భావించే వినియోగదారులు రూ. 21,000 చెల్లించిన బుకింగ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్ మినహా ఈ కార్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ కార్లు 1.2 లీటర్‌ 3 సిలిండర్‌ నేచురల్‌ ఆస్పిరేటెడ్‌ ఇంజిన్‌తో వస్తాయి. ఈ సీఎన్‌జీ ఆటోమేటిక్ వేరియంట్లు కిలోకు 28.06 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. ఇక, ఈ కార్లు కొత్త రంగుల్లో అందుబాటులోకి రానున్నాయి. టాటా టియాగో టోర్నడో బ్లూ, గ్రాస్‌ల్యాండ్‌ బీజ్‌, మెటోర్‌ బ్రాంజ్‌ రంగుల్లో లభిస్తాయి. టాటా సీఎన్‌జీ వాహనాల్లో ట్విన్ సిలిండర్ టెక్నాలజీ, హై ఎండ్‌ ఫీచర్‌, సీఎన్‌జీ డైరెక్ట్ స్టార్ట్‌ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ లిమిటెడ్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ అమిత్ కామత్‌ చెప్పారు. ఈ సెగ్మెంట్‌లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చేందుకు టాటా మోటార్స్‌ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. గత రెండేళ్ల కాలంలో దేశీయంగా 1.30 లక్షల సీఎన్‌జీ వాహనాలను విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed