- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Steel: టాటా స్టీల్‌కు రూ. వెయ్యి కోట్ల షోకాజ్ నోటీసులు
ఐటీసీ ఆరోపణలపై రూ. 1,007 కోట్ల షోకాజ్ నోటీసులతో పాటు టాక్స్ డిమాండ్ నోటీసులను అందుకున్నట్టు కంపెనీ పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని అతిపెద్ద స్టీల్ కంపెనీలలో ఒకటైన టాటా స్టీల్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ అవకతవకలకు సంబంధించి భారీ పన్ను నోటీలను అందుకుంది. 2018-19 నుంచి 2022-23 మధ్య కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా రూ. 1,000 కోట్లకు పైగా ఇన్‌పుట్ ట్యాస్క్ క్రెడిట్(ఐటీసీ) పొందిన ఆరోపణలపై రూ. 1,007 కోట్ల షోకాజ్ నోటీసులతో పాటు టాక్స్ డిమాండ్ నోటీసులను అందుకున్నట్టు కంపెనీ ఆదివారం తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. నోటీసులు అందించ 30 రోజుల్లోగా కంపెనీ జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ సెంట్రల్ జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అదనపు/జాయింట్ కమిషనర్ ముందు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. సీజీఎస్టీ/ఎస్‌జీఎస్టీ చట్టం-2017లోని సెక్షన్ 74(1), ఐజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 20 కింద నిబంధనల ఉల్లంఘన జరిగిందని అధికారులు తెలిపారు. దీనిపై వివరణ ఇచ్చిన టాటా స్టీల్ ఇప్పటికే రూ. 541.19 కోట్ల జీఎస్టీ చెల్లించామని, జీఎస్టీ అధికారులు పేర్కొన్న దాంట్లో ఇంకా రూ. 493.35 కోట్లు మాత్రమే చెల్లించాలసి ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో జీఎస్టీ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక, నిర్వహణ, ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది.






