- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన టాటా మోటర్స్ కమర్షియల్ వాహన విభాగం
టాటా గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors)లోని కమర్షియల్ వాహన విభాగం Tata Motors Commercial Vehicles Ltd (TMLCV) బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) స్టాక్ మార్కెట్లలో అధికారికంగా లిస్టయింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొద్దిరోజులుగా భారత్ లో ప్రఖ్యాతి గాంచిన కీలక కంపెనీలలోని వివిధ విభాగాలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. వాటిలో Groww మాతృసంస్థ Billionbrains Garage Ventures Ltd, ఆప్టికల్ రిటైల్ రంగంలోని ప్రముఖ సంస్థ Lenskart Solutions Ltd IPO, వ్యవసాయ రసాయన రంగంలో ఉన్న Advance Agrolife Ltd, SME విభాగంలో Takyon Networks Ltd వంటి కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయి.. చిన్న స్థాయి IPOలకూ పెట్టుబడిదారుల ఆసక్తి పెంచుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో టాటా గ్రూప్‌కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors)లోని కమర్షియల్ వాహన విభాగం Tata Motors Commercial Vehicles Ltd (TMLCV) బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) స్టాక్ మార్కెట్లలో అధికారికంగా లిస్టయింది.
ఇటీవలే టాటా మోటర్స్ ప్రధాన సంస్థ నుండి ఈ విభాగాన్ని డీ మెర్జ్ (de-merge) చేయగా, ఇప్పుడు స్వతంత్ర కంపెనీగా మార్కెట్‌లో ప్రవేశించింది. టాటా మోటర్స్ వాణిజ్య వాహన విభాగం లిస్టింగ్‌తో పెట్టుబడిదారులకు స్పష్టమైన వ్యాపార విలువ ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కంపెనీ బస్సులు, ట్రక్కులు, లైట్ కమర్షియల్ వాహనాల విభాగంలో ఆధిపత్యం కొనసాగిస్తుందని, రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ వాహన (EV) రంగంపై మరింత దృష్టి సారించనుందని అధికారులు వెల్లడించారు.






