Swiggy: 'వన్' ఆర్డర్‌లపై అదనపు ఛార్జీలు విధించనున్న స్విగ్గీ

by S Gopi |

నవంబర్ 25 నుంచి కొత్త రుసుము అమల్లోకి వస్తుందని, ఈ మేరకు ఎంపిక చేసిన రెస్టారెంట్లకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది.

Swiggy: వన్ ఆర్డర్‌లపై అదనపు ఛార్జీలు విధించనున్న స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ తన ప్రీమియం మెంబర్షిప్ 'వన్' నుంచి చేసే ఆర్డర్‌లపై కొత్త ఛార్జీలను అమలు చేయనున్నట్టు వెల్లడించింది. ఎంపిక చేసిన రెస్టారెంట్లకు ఈ కొత్త ఛార్జీలు వర్ర్తిస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 25 నుంచి కొత్త రుసుము అమల్లోకి వస్తుందని, ఈ మేరకు ఎంపిక చేసిన రెస్టారెంట్లకు సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. ఆర్డర్ మొత్తంపై ఆధారపడి రుసుము ఉండొచ్చని సమాచారం. కొత్త రుసుము కారణంగా ఒక్కో ఆర్డర్‌పై రూ. 2-5 మధ్య పెరిగే అవకాశం ఉంది. చెల్లించాల్సిన తుది మొత్తం ఒక రెస్టారెంట్ చెల్లించే ఖచ్చితమైన రుసుము ఆ వారంలో ఎన్ని స్విగ్గీ వన్ ఆర్డర్‌లను పొందుతుందో దానిపై ఆధారపడి ఉంటుందని కంపెనీ వివరణ ఇచ్చింది. కొత్త లెవీ ప్రామాణికంగా 17–25 శాతం బేస్ కమిషన్, ఇతర రుసుములు వంటి ప్రస్తుత ఛార్జీలకు అదనంగా ఉంటుంది. కాగా, ఈ ఏడాది మే నెల నుంచి కంపెనీ తన ప్రీమియం మెంబర్లకు అదనపు రుసుమును వసూలు చేయడం మొదలుపెట్టింది. గతంలో స్విగ్గీ వన్ వినియోగదారులకు ఈ రుసుము విషయంలో మినహాయింపు ఉండేది.

Next Story