- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Airtel: తర్వాతి తరానికి ఎయిర్‌టెల్ పగ్గాలు
ఎయిర్‌టెల్ నాయకత్వాన్ని తర్వాతి తరానికి అప్పగించడంపై కంపెనీ మాతృసంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ రెండో అతిపెద్ద టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌లో నాయకత్వం మార్పు జరగనుంది. దీనికి సంబంధించి వచ్చే పదేళ్లలో భారతీ ఎయిర్‌టెల్ నాయకత్వాన్ని తర్వాతి తరానికి అప్పగించడంపై కంపెనీ మాతృసంస్థ భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాలకు సంబంధించి జరిగిన ఎర్నింగ్స్ కాల్‌లో మాట్లాడిన ఆయన.. కేవలం వారసత్వ మార్పు కాకుండా, సంస్థపై కుటుంబ నియంత్రణను మరింత బలపరిచే వ్యూహాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. తర్వాతి తరానికి పగ్గాలు అప్పగించే సమయానికి ప్రమోటర్ల వాటా మళ్లీ 51 శాతానికి పెంచాలని అన్నారు.
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో ఉన్న ప్రమోటర్ల వాటాను భారతీ టెలికాం కిందకు తీసుకురావాలని సునీల్ మిట్టల్ భావిస్తున్నారు. కంపెనీ నుంచి వచ్చే డివిడెండ్లు, షేర్ బైబ్యాక్‌ల ద్వారా క్రమంగా మరిన్ని షేర్లు కొనుగోలు చేసి, కుటుంబ నియంత్రణను పెంచుకునే ప్రణాళిక ఉందన్నారు. మరోవైపు, సింగ్‌టెల్ తన వాటాను తగ్గించే కొద్దీ, భారతీ కుటుంబానికి ఎయిర్‌టెల్‌పై మరింత పట్టు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌ను కేవలం టెలికాం సంస్థగా కాకుండా, తరాల పాటు ఉండే గ్లోబల్ వ్యాపారంగా కొనసాగించాలని ఆయన ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.






