- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stocks: భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఫుల్ ఖుషీలో ఇన్వెస్టర్లు
భారత్ (India), పాకిస్తాన్ (Pakistan)లు వారాంతంలో కాల్పుల విరమణకు అంగీకరించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ (India), పాకిస్తాన్ (Pakistan)లు వారాంతంలో కాల్పుల విరమణకు అంగీకరించిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.55 గంటల సమయానికి సెన్సెక్స్ 2,162 పాయింట్ల లాభంతో 81,616 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 633 పాయింట్ల లాభంతో 24,671 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా అగ్ర దేశం అమెరికా (America), చైనా (China) మధ్య టారిఫ్ డీల్ కుదిరే అవకాశాలు మెరుగవ్వడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీ (9Domestic Stock Market Index)లు లాభాల బాట పట్టాయి.
ఇక నిఫ్టీ (NIFTY)లో జియో ఫైనాన్షియల్, శ్రీరామ్ ఫైనాన్స్, లార్సెన్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ, ఎంటర్‌ప్రైజెస్, REC లిమిటడ్, DLF, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, పవన్ ఫైనాన్స్ కార్పొరేషన్, జియో ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు సన్ ఫార్మాసూటికల్స్ ఇండస్ట్రీస్, దివీస్ లాబోరెటరీస్, స్విగ్గీ, జెదస్ లైఫ్ సైన్సెస్, హిందుస్థాన్ ఎరోనాటిక్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.






