- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: రెండు రోజుల భారీ పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ వివాదం త్వరలో ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముడి చమురు ధరలు తగ్గేందుకు దోహదపడ్డాయి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు రెండు రోజుల భారీ పతనం తర్వాత మంగళవారం ట్రేడింగ్‌లో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు నష్టాల పుంజుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో సోమవారం 100 డాలర్లకు పైగా పెరిగిన ముడి చమురు ధరలు తగ్గడం, ప్రపంచ మార్కెట్లలో రికవరీ, పశ్చిమాసియాలో సంఘర్షణలు త్వరలో ముగుస్తాయనే ఆశలు, దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ వివాదం త్వరలో ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ముడి చమురు ధరలు తగ్గేందుకు దోహదపడ్డాయి. ఇది ప్రపంచ మార్కెట్లలో రిస్క్‌ని తగ్గించింది. దీని ప్రభావంతో యుఎస్ డాలర్ కూడా కొంత బలహీనపడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 639.82 పాయింట్లు లాభపడి 78,205 వద్ద, నిఫ్టీ 233.55 పాయింట్లు పెరిగి 24,261 వద్ద ముగిశాయి. ప్రపంచ చమురు బెంచ్‌మార్క్ బ్రెంట్ ముడి చమురు మంగళవారం బ్యారెల్‌కు 5.18 శాతం తగ్గి 93.83కి చేరుకుంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్ ఎక్కువ లాభాలను ఆర్జించాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 91.94 వద్ద ఉంది.






