- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market : అమెరికా హెచ్చరికలతో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ప్రధానంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు కనిపించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు నమోదయ్యాయి. భారత్‌పై సుంకాలను మరింత పెంచుతామని అమెరికా నుంచి కొత్త హెచ్చరికలు వెలువడిన నేపథ్యంలో, బ్లూ-చిప్ కంపెనీలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. దీంతో సోమవారం ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు కనిపించాయి. మరోవైపు గత వారాంతం వెనిజులాపై అమెరికా దాడి, ఆ దేశాధ్యక్షుడుని యూఎస్ అదుపులోకి తీసుకోవడం వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో మన మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రస్తుతానికి ఈ అంశంపై వేచి చూసే ధోరణిలో మదుపర్లు వ్యవహరిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 322.39 పాయింట్లు క్షీణించి 85,439 వద్ద, నిఫ్టీ 78.25 పాయింట్లు పడిపోయి 26,250 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బీఈల్, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా 1 శాతానికి పైగా నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 90.21 వద్ద ఉంది.






