Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

by Maddikunta Saikiran |

దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు లాభాల్లో ముగిశాయి.

Stock Market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
X

దిశ, వెబ్‌‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్ రావడంతో ఉదయం నష్టాలతో మొదలైన ట్రేడింగ్స్ మార్కెట్ ముగిసే సమయానికి బలంగా పుంజుకున్నాయి. ఒకానొక దశలో 1100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 840 పాయింట్లు లాభపడటం విశేషం. ముఖ్యంగా ఈ రోజు భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్‌(Sensex) ఉదయం 81,212.45 పాయింట్ల నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 82,213.92 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్‌ చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133.12 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) 219 పాయింట్లు లాభంతో 24,768.30 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.94 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.79గా ఉంది.

లాభాల్లో ముగిసిన షేర్లు: కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, భారతీ ఎయిర్‌టెల్

నష్టాల్లో ముగిసిన షేర్లు: టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, JSW స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్

Next Story