- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: మళ్లీ ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా రెండో రోజూ ఫ్లాట్(Flat)గా ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) వరుసగా రెండో రోజూ ఫ్లాట్(Flat)గా ముగిశాయి. సెంటిమెంట్ బలపరిచే న్యూస్ లేకపోవడంతో ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు మార్కెట్ ముగిసే వరకు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొవడంతో ఈ రోజు(బుధవారం)కూడా ఫ్లాట్ గా ముగిశాయి. ముఖ్యంగా ఈ రోజు ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్(Sensex) ఉదయం 81,568.39 పాయింట్ల ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,742.37 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) 31.75 పాయింట్లు లాభంతో 24,641.80 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 72.81 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.84గా ఉంది.
లాభాల్లో ముగిసిన షేర్లు: ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్
నష్టాల్లో ముగిసిన షేర్లు: JSW స్టీల్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్, టెక్ మహీంద్రా






