- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Stock Market: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్.. రాణించిన రియాల్టీ, ఐటీ షేర్లు..!
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు ఫ్లాట్(Flat)గా ముగిశాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) ఈ రోజు ఫ్లాట్(Flat)గా ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు చివరికి ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ల కొనుగోళ్ల మద్దతుతో రికవరీ అయ్యాయి. ముఖ్యంగా ఈ రోజు రియాల్టీ, ఐటీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లు రాణించాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 81,575.96 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,182 - 81,726 పాయింట్ల మధ్య కదలాడి చివరికి 1.59 పాయింట్ల లాభంతో 81,510 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) 8.95 పాయింట్లు నష్టంతో 24,610 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.85గా ఉంది.
లాభాల్లో ముగిసిన షేర్లు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, HCL టెక్నాలిజీస్, బజాజ్ ఫైనాన్స్
నష్టాల్లో ముగిసిన షేర్లు: అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, రిలియన్స్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్






