- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Star Health Insurance: చిన్న పట్టణాలపై స్టార్‌హెల్త్ ఫోకస్
ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆరోగ్య బీమా విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కంపెనీ భావిస్తోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆరోగ్య బీమా రంగం వేగంగా విస్తరిస్తున్న సమయంలో ప్రముఖ బీమా కంపెనీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చిన్న పట్టణాలు, మార్కెట్లపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లో ఆరోగ్య బీమా విస్తరణకు అవకాశాలు ఉన్నాయని కంపెనీ భావిస్తోంది. దీనికోసం తక్కువ ప్రీమియంతో రెండు కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి వచ్చే నెలలో ప్రకటన ఉండొచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లలో వైద్య ఖర్చులు గణనీయంగా పెరగడం, మధ్యతరగతి కుటుంబాల్లో ఆరోగ్య భద్రతపై అవగాహన పెరగడం వల్ల చిన్న నగరాల్లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అయితే అధిక ప్రీమియంలు చాలా మందికి ఇప్పటికీ అడ్డంకిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, ప్రాథమిక ఆరోగ్య రక్షణ అందించే ప్లాన్‌లకు డిమాండ్ ఉందని స్టార్‌హెల్త్ భావిస్తోంది. ముఖ్యంగా ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా హాస్పిటల్ నెట్‌వర్క్‌ను రూపొందించే దిశగా కూడా కంపెనీ పని చేస్తున్నట్లు సమాచారం. ఆరోగ్య బీమాను మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకు చేరువ చేయడమే లక్ష్యమని కంపెనీ వెల్లడించింది.






