- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Indian Vehicles: భారతీయ వాహనాలపై 50 శాతం సుంకం విధించే యోచనలో దక్షిణాఫ్రికా
ప్రస్తుతం ఈ నిర్ణయం ఆ దేశ ట్రేడ్, ఇండస్ట్రీ, కాంపిటీషన్ డిపార్ట్‌మెంట్ సమీక్ష పరిధిలో ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, చైనా నుంచి దిగుమతి చేసుకునే వాహనాలపై 50 శాతం వరకు సుంకాలను విధించే అంశాన్ని దక్షిణాఫ్రికా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పెరుగుతున్న వాహనాల దిగుమతుల వల్ల స్థానిక ఆటో తయారీ పరిశ్రమపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నిర్ణయం ఆ దేశ ట్రేడ్, ఇండస్ట్రీ, కాంపిటీషన్ డిపార్ట్‌మెంట్ సమీక్ష పరిధిలో ఉంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కీలక ఎగుమతి మార్కెట్లుగా ఉన్న భారత్, చైనా నుంచి వాహనాలను నిలువరించేలా మార్గాలను గుర్తించేందుకు ఒక అంతర్గత సమీక్ష జరిగింది. ఈ రెండు దేశాల నుంచి జరిగే దిగుమతులు దక్షిణాఫ్రికా వాహన పరిశ్రమ పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అక్కడి అధికారులు భావిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ అధికారులు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశాలైన భారత్, చైనాకు సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా దిగుమతి సుంకాలను పరిశీలిస్తోంది.
ఇటీవలి డేటా ప్రకారం, భారత్, చైనా దక్షిణాఫ్రికాకు రెండు అతిపెద్ద వాహన ఎగుమతిదారులుగా అవతరించాయి. 2024లో మొత్తం వాహన దిగుమతులలో భారత్ 53 శాతం, చైనా 22 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ స్థాయి దిగుమతుల వల్ల స్థానిక వాహన పరిశ్రమకు నష్టాలు ఎదురవుతాయని దక్షిణాఫ్రిక అభిప్రాయపడింది. అంతేకాకుండా, గత నాలుగేళ్ల కాలంలో చైనా నుంది ఆ దేశానికి ఎగుమతులు 368 శాతం, భారత్ నుంచి 135 శాతం పెరిగాయి. ఇది ఆ దేశ వాహన పరిశ్రమలో ఎంట్రీ-లెవెల్ విభాగంలో అత్యధిక పోటీ ఏర్పడింది. అందుకే పన్నుల ద్వారా భారత్, చైనా వాహనాల దిగుమతులని నియంత్రించి, స్థానిక పరిశ్రమను కాపాడుకోవాలని దక్షిణాఫ్రికా వెల్లడించింది.






