Today Gold price : హమ్మయ్యా..! బంగారం కొనేవారికి స్వల్ప ఊరట

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-30 05:15:43  IST  )

బంగారం ధరల పెరుగుదల నుంచి కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది.

Today Gold price : హమ్మయ్యా..! బంగారం కొనేవారికి స్వల్ప ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరల నుంచి నేడు కొంచెం ఊరట లభించింది. మార్చి 25 నుంచి 28 మధ్యకాలంలో 10 గ్రాముల బంగారం ధర రూ.5180 నుంచి రూ.4750 మేర పెరిగింది. తాజాగా ఈ పెరుగుదల నుంచి కొనుగోలు దారులకు స్మాల్ రిలీఫ్ లభించింది. సోమవారం ఉదయం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.810 తగ్గి రూ.1,47,280కి దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.750 తగ్గి రూ.1,35,000కు పతనమైంది. పెద్దమొత్తంలో బంగారం కొనుగోలు చేసేవారికి తగ్గిన ధరలు కాస్త ఊరటనివ్వనున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2,50,000గా ఉంది.

Next Story