Microsoft: ఏఐ కొత్త దశలోకి అడుగుపెట్టింది: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్

by S Gopi |

ఏఐ ఇకపై కేవలం ఒక ఆలోచన లేదా ప్రయోగం కాదు. ఇది ఇప్పటికే వాస్తవ రూపంలో వాడకంలో ఉంది.

Microsoft: ఏఐ కొత్త దశలోకి అడుగుపెట్టింది: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధస్సు(ఏఐ) కొత్త దశలోకి అడుగుపెట్టిందని మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ అభిప్రాయపడ్డారు. హైప్, పైలట్‌లను దాటి, వ్యాపార సంస్థలు ఎలా పనిచేస్తాయో ఇప్పటికే చూస్తున్నామని అన్నారు. ఏఐ ఇకపై కేవలం ఒక ఆలోచన లేదా ప్రయోగం కాదు. ఇది ఇప్పటికే వాస్తవ రూపంలో వాడకంలో ఉంది. అనేక కంపెనీలు పనిచేసే విధానాన్ని ఏఐ మారుస్తోందని తెలిపారు. చాలా వ్యాపారాలు ఏఐని పరీక్షించే దశను దాటిపోయాయి. ఇప్పుడు నిజమైన ఫలితాలను పొందడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి. అయితే, ఏఐ వినియోగం వేగంగా పెరుగుతున్న కొద్దీ, ఇలాంటి తరుణంలో ప్రజలు, కంపెనీలకు అత్యంత ముఖ్యమైన రక్షణ అవసరం, అది నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి వల్ల అలవడుతుందని నమ్ముతున్నట్టు పునీత్ చందోక్ పేర్కొన్నారు. ఏఐ తదుపరి దశ దాన్ని బాధ్యతాయుతంగా, ఆలోచనాత్మకంగా ఉపయోగించడం అని చందోక్ అన్నారు. గతంలో కొంతమంది నిపుణులకే పరిమితం అయిన ఏఐ, ఇప్పుడు శక్తివంతమైన కంప్యూటర్లు, అధునాతన ఏఐ మోడల్స్ కారణంగా విస్తృతంగా అందుబాటులోకి వస్తోంది. భవిష్యత్తులో, ఏఐ టూల్స్ డిజిటల్ సహోద్యోగుల మాదిరి పనిచేస్తాయి. డేటాను విశ్లేషించడం, సాధారణ పనులు చేయడం, నిర్ణయం తీసుకోవడంలో సపోర్ట్ ఇవ్వడం ద్వారా మానవాళికి సహాయపడతాయి. అయితే, ఇప్పటికీ ఏఐ మనుషుల నియంత్రణలోనే ఉంటుంది. వారు ఏఐ తుది ఫలితాలకు బాధ్యత వహిస్తారఅని చందోక్ వెల్లడించారు.

Next Story