- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Simple Energy: 400 కిలోమీటర్ల రేంజ్‌తో కొత్త ఈ-స్కూటర్ విడుదల చేసిన సింపుల్ ఎనర్జీ
దేశంలోనే అతిపెద్ద 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్, గంటకు 115 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ మార్కెట్లోకి కొత్త ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఏకంగా 400 కిలోమీటర్ల రేంజ్‌తో కంపెనీ 'సింపుల్ ఆల్ట్రా' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక రేంజ్ అందించే ఈవీ స్కూటర్ అని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, దేశంలోనే అతిపెద్ద 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వచ్చే ఈ స్కూటర్, గంటకు 115 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 2.77 సెకన్లలో 0-40 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకుంటుంది. సింపుల్ ఆల్ట్రాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని కంపెనీ స్పష్టం చేసింది. కస్టమర్ల కొసం ఎక్కడా రాజీ పడకుండా అత్యధిక రేంజ్, పనితీరుతో సింపుల్ ఆల్ట్రా స్కూటర్‌ను తెచ్చామని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ అన్నారు. ఆల్ట్రాతో పాటు మరో మూడు స్కూటర్లను విడుదల చేసింది. అందులో 190 కిలోమీటర్ల రేంజ్‌తో సింపుల్ వన్ఎస్ జెన్2ను తెచ్చింది. దీని ధర రూ. 1,49,999గా నిర్ణయించింది. సింపుల్ వన్ జెన్2 రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 236 కి.మీ రేంజ్‌తో వచ్చే స్కూటర్ 4.5 కిలోవాట్ అవర్ వెర్షన్ ధర రూ. 1,69,999 ఉండగా, 265 కి.మీ రేంజ్ ఉన్న 5 కిలోవాట్ అవర్ వేరియంట్ ధర రూ. 1,77,999 నుంచి ప్రారంభమవుతుంది.






