- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Silver: మళ్లీ పెరుగుతున్న వెండి, బంగారం ధరలు
అమెరికన్ డాలర్ బలహీనపడటం, తక్కువ ధరకు కొనుగోళ్లు జరగడం వల్ల సోమవారం బంగారం ధరలు పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికన్ డాలర్ బలహీనపడటంతో సోమవారం రాత్రి 10.30 గంటలకు బులియన్ మార్కెట్లో వెండి ధరలు 6 శాతానికి పైగా పెరిగి కిలో రూ. 2.72 లక్షలకు చేరుకున్నాయి, బంగారం ధర దాదాపు 1 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1.58 లక్షలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలో రూ. 15 వేలు పెరిగి రూ. 3,00,000కి చేరుకుంది. స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర రూ. 1,310 పెరిగి రూ. 1,58,500కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,200 పెరిగి రూ. 1,44,750కి పెరిగింది. అమెరికన్ డాలర్ బలహీనపడటం, తక్కువ ధరకు కొనుగోళ్లు జరగడం వల్ల సోమవారం బంగారం ధరలు పెరిగాయి. డాలర్ ఇండెక్స్ దాదాపు 0.30 శాతం తగ్గి 97 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. దీనివల్ల బులియన్ ధరలను ప్రభావితం చేశాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. గ్లోబల్ మార్కెట్లలోనూ ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ వెండి ధర 2.81 శాతం పెరిగి ఔన్సు 80.21 డాలర్లకు చేరుకోగా, బంగారం ధర 1 శాతం పెరిగి ఔన్సుకు 5,012.94 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా జనవరిలో వరుసగా 15వ నెల కూడా బంగారం కొనుగోళ్ల పరంపరను కొనసాగించినట్టు డేటా వెలువడటంతో విలువైన లోహాలపై పెట్టుబడిదారుల సెంటిమెంట్ మరింత పెరిగిందని గాంధీ పేర్కొన్నారు.






