శ్రీరామనవమి వేళ.. పతనమైన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం

by Naga Rani Yarlagadda |

శ్రీరామనవమి పర్వదినం వేళ.. వెండి ధర భారీగా పతనమవ్వగా.. బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

శ్రీరామనవమి వేళ.. పతనమైన వెండి ధర.. స్వల్పంగా పెరిగిన బంగారం
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టం. నిత్యం ట్రేడింగ్ చేసేవాళ్లు ఈ ధరల హెచ్చుతగ్గులను కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. ధరల పెరుగుదల, తగ్గుదల ఇన్వెస్టర్ల చేతిలోనే సగానికి పైగా ఉంటే.. మిగతాది డాలర్ తో రూపాయి విలువ, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. శ్రీరామనవమి వేళ.. శుక్రవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.160 పెరిగి.. రూ.1,44,710కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 మేర పెరిగి రూ.1,32,650కి వెళ్లింది. మరోవైపు వెండి ధర భారీగా పతనమైంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.15,000 తగ్గింది. శుక్రవారం హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. లైవ్ ట్రేడింగ్ ను బట్టి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.

Next Story