- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాలుగురోజుల తర్వాత భారీగా పతనమైన వెండి.. బంగారం ధర కూడా..
నాలుగురోజులు స్థిరంగా ఉన్న వెండి ధర నేడు భారీగా తగ్గింది. బంగారం ధర సైతం తగ్గడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: నాలుగురోజుల తర్వాత వెండి ధర భారీగా పతనమైంది. ఫిబ్రవరి 9న కిలో వెండిపై రూ.15000 పెరిగి రూ.3,00,000 లకు చేరిన రేటు.. నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగింది. నేడు ఏకంగా రూ.20,000 పతనమై కిలో వెండి ధర రూ.2,80,000 (జీఎస్టీ అదనం)కి తగ్గింది. బంగారం ధరలు సైతం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2620 తగ్గి రూ.1,55,780కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2400 తగ్గి రూ.1,42,800కి చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1960 తగ్గి రూ.1,16,840వద్ద కొనసాగుతోంది. తగ్గిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటాయి. నిన్న, ఈరోజు కలిపి బంగారం ధర 10 గ్రాములపై రూ.3500 నుంచి రూ.3820 వరకూ తగ్గింది. నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు మొదలు కానున్న సమయంలో బంగారం, వెండి రేట్లు ఈ స్థాయిలో తగ్గడంతో కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండవచ్చు.






