భారీగా పడిపోయిన వెండి ధరలు.. గంటలో రూ.21 వేలు ఢమాల్

by Muthe.Rajitha |

ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి.

భారీగా పడిపోయిన వెండి ధరలు.. గంటలో రూ.21 వేలు ఢమాల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫ్యూచర్స్ మార్కెట్‌లో వెండి ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఉదయం ఆల్‌టైమ్ హైగా కిలోకు రూ.2,54,174 వద్ద ప్రారంభమై, కేవలం కొద్దిసేపట్లోనే రూ.2,33,120కు పడిపోయింది. అంటే ఒక్క గంటలోనే దాదాపు కిలోకు రూ.21 వేల వరకు తగ్గింది, ఇది 8 శాతం కంటే ఎక్కువ డౌన్ ఫాల్. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా వెండి ధర ఔన్స్‌కు 80 డాలర్లు దాటిన తర్వాత 75–77 డాలర్లకు తగ్గింది. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ మార్జిన్ నిబంధనలు పెంచడంతో ట్రేడర్లు పొజిషన్లు అమ్ముకోవడం, లాభాల స్వీకరణ, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం వంటి కారణాలు ఈ పతనానికి దారితీశాయి. ఈ తగ్గుదల తాత్కాలికమా లేక ట్రెండ్ మార్పా అన్నదానిపై నిపుణుల మధ్య చర్చ కొనసాగుతోంది. మార్కెట్ ఇంకా అస్తిరంగా ఉండే అవకాశం ఉందని ట్రేడర్లకు హెచ్చరికలు జారీ చేసారు.

Next Story