రికార్డు ధరకు చేరుకున్న వెండి.. ఇక పట్టీలు కొనడం కూడా భారమే?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-28 07:02:20  IST  )

బంగారం, వెండి ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్నాయి. వెండి ధరైతే ఊహకందని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి షాకుల మీద షాకులిస్తోంది.

రికార్డు ధరకు చేరుకున్న వెండి.. ఇక పట్టీలు కొనడం కూడా భారమే?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు అడ్డు, అదుపు లేకుండా పెరుగుతున్నాయి. వెండి ధరైతే ఊహకందని రీతిలో పెరుగుతూ సామాన్యుడికి షాకుల మీద షాకులిస్తోంది. బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3220 పెరిగి 1,65,170కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2950 పెరిగి రూ.1,51,400కి చేరింది. 18 క్యారెట్ల బంగారం కూడా రూ.2420 పెరిగి 10 గ్రాముల ధర రూ.1,23,880కి ఎగబాకింది.

వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగింది. బుధవారం కేజీ వెండి ధర ఏకంగా రూ.13000 పెరిగి రూ.4 లక్షలకు చేరింది. 10 గ్రాముల వెండి ధర రూ.4000 ఉంది. ఈనెల 23 నుంచి నేటి వరకూ అంటే ఐదు రోజుల్లో కిలో వెండి ధరపై రూ.60,000 పెరిగింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం, వెండికి ప్రాధాన్యమిస్తారు. ముఖ్యంగా మన భారతీయ స్త్రీలకు బంగారం అంటే మక్కువ. పెళ్లిళ్లు, ఓణీల ఫంక్షన్ల సమయంలో ఆడపిల్లలకు 10 తులాల పట్టీలు కొనాలన్నా రూ.40,000 - రూ.45,000 వరకూ ఖర్చవుతుంది. వెండి ఈ స్థాయిలో పెరగడంతో ఇప్పుడే ఇలా ఉంటే.. అసలు మున్ముందు వెండి కొనే పరిస్థితి ఉంటుందా ? అని ఆందోళన చెందుతున్నారు.

Next Story