- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తప్పనిసరేనా? అన్ని రూట్లలో ఈ పాస్ చెల్లుతుందా?
ఆగస్టు 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (Fastag Annual Pass) అమల్లోకి రానుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆగస్టు 15వ తేదీ నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (Fastag Annual Pass) అమల్లోకి రానుంది. అయితే ప్రతి వాహనదారుడు ఈ పాస్ తీసుకోవాల్సిందేనా ? అన్ని టోల్ రూట్స్ లోనూ ఈ పాస్ చెల్లుతుందా ? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ తీసుకుంటే నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్ ప్రెస్ వే ల మీదుగా వెళ్లేటపుడు కారు, జీప్, వ్యాన్లు లేదా లారీలు వంటి వాహనాలు టోల్ ఫీజును ఈజీగా చెల్లించవచ్చు. సుమారు 200 ట్రిప్పుల వరకూ ఈ పాస్ పనిచేస్తుంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వెహికల్ అర్హతను నిర్థారించిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. రాజ్ మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా NHAI వెబ్ సైట్ ద్వారా 2025-26 బేస్ సంవత్సరానికి రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులను నిర్థారించిన తర్వాత 2 గంటల్లోపు రిజిస్టర్డ్ ఫాస్టాగ్ లో వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది. ఒకసారి పాస్ యాక్టివేట్ అయ్యాక ఆ రోజు నుంచి ఏడాది వరకు, లేదా 200 ట్రిప్పుల వరకూ పాస్ పనిచేస్తుంది.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పాస్ తీసుకోని వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద ఎప్పటిలాగానే ఫీజు చెల్లించి వెళ్లవచ్చు. కానీ ఎలాంటి రాయితీలు లభించవు. ఇక పాస్ తీసుకున్న వాహనదారులు నేషనల్ హైవే, నేషనల్ ఎక్స్ ప్రెస్ వేలలోనే యాన్యువల్ పాస్ ను వినియోగించగలరు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు నిర్వహించే ఎక్స్ ప్రెస్ వేలు, స్టేట్ హైవేలపై ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు బదులుగా సాధారణ టోల్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.






