Today's Gold Prices: మహిళలకు షాకింగ్ న్యూస్.. తులం బంగారం ధర ఎంతంటే?

by Jakkula.Mamatha |

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Todays Gold Prices: మహిళలకు షాకింగ్ న్యూస్.. తులం బంగారం ధర ఎంతంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరో రోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడి ప్రియులు కాస్త ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొంచెం తగ్గగానే డబుల్, త్రిబుల్ ధర పెరుగుతుంది. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ. 1,19,400 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.1,19,400గా(స్థిరంగా) ఉంది. అలాగే నిన్న రూ.1,09,450 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధర పై నేడు 1,09,450గా ఉంది. ఇక అటు వెండి ధర కిలో రూ. 1,65,000గా ఉంది. కాగా రెండు రోజుల్లోనే వెండి ధరలు మూడు వేలు పెరగడం గమనార్హం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,09,450

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,19,400

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే?

22 క్యారెట్ల బంగారం ధర-రూ.1,09,450

24 క్యారెట్ల బంగారం ధర-రూ.1,19,400

Next Story