- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: 26,200 పైన ముగిసిన నిఫ్టీ.. సెన్సెక్స్‌కు 1,000 పాయింట్ల లాభం
ఫలితంగా ఇది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులకు సానుకూలమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం భారీ ర్యాలీ జరిగింది. గత కొన్ని సెషన్లుగా వరుస నష్టాలను చూసిన సూచీలు భారీ లాభాలను సాధించాయి. ఇందుకు ప్రధానంగా గ్లోబల్ మార్కెట్ల నుంచి లభించిన సానుకూల సంకేతాలకు తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాల నేపథ్యంలో భారతీయ ఈక్విటీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా డిసెంబర్‌లో జరిగే ఫెడ్ సమావేశంలో రేట్ల కోత వల్ల అమెరికా వడ్డీ రేట్లు తగ్గుతాయని, ఫలితంగా ఇది భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులకు సానుకూలమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తాజాగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు చేరుకోవడం కూడా మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి, మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపడం కూడా మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయని నిపుణులు తెలిపారు. ఈ క్రమంలోనే కీలక బెంచ్‌మార్క్ బీఎస్ఈ 1,000 పాయింట్లకు పైగా పెరిగింది. నిఫ్టీ సైతం సరికొత్త గరిష్టాలకు చేరువయ్యాయి. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద బుధవారం ఒక్కరోజే రూ. 6 లక్షల కోట్లకు పైగా పుంజుకోగా, బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 475 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇక, మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,022.50 పాయింట్లు లాభపడి 85,609 వద్ద, నిఫ్టీ 320.50 పాయింట్లు పెరిగి 26,205 వద్ద ముగిశాయి. నిఫ్టీలో మెటల్, ఆటో, ఫైనాన్స్, ఐటీ, బ్యాంకింగ్ సహా కీలక రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్ మినహా అన్ని కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా బజాజ్ ట్విన్స్, టాటా స్టీల్, రిలయన్స్, టీఎంపీవీ, యాక్సిస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్ స్టాక్స్ 1.80 శాతానికి పైగా పెరిగాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 89.22 వద్ద ఉంది.






