- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Stock Market: ఆగని స్టాక్ మార్కెట్ల నష్టాలు
పెరుగుతున్న చమురు ధరలు, బలహీన గ్లోబల్ మార్కెట్లు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండటంతో ఈక్విటీలపై ఒత్తిడి పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న చమురు ధరలు, బలహీన గ్లోబల్ మార్కెట్లు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతుండటంతో ఈక్విటీలపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా గురువారం మరోసారి బెంచ్‌మార్క్ సూచీలు అధిక నష్టాలను చూశాయి. ప్రధానంగా మధ్యప్రాచ్యంలో యూఎస్-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతుండటం వల్ల ముడి చమురు ధరలు మళ్లీ 100 డాలర్లకు చేరాయి. ఇది గ్లోబల్ ఇన్వెస్టర్లతో మన మదుపర్ల సెంటిమెంట్‌ను కూడా బలహీనపరిచింది. క్రూడ్ ధరల ప్రభావం మనదేశంపై ఎక్కువగా ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతాయని, కరెంట్ ఖాతా లోటును పెంచుతాయనే ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 829.29 పాయింట్లు క్షీణించి 76,034కు, నిఫ్టీ 227.70 పాయింట్లు నష్టపోయి 23,639 వద్ద ముగిశాయి. కీలక ఆటో, బ్యాంకింగ్, కేపిటల్ గూడ్స్ రంగాలలో అనేక కీలక కంపెనీల స్టాక్‌లలో అమ్మకాలు కనిపించాయి. దీనివల్ల ఇన్వెస్టర్లు ఒక్కరోజే రూ. 5.63 లక్షల కోట్లు నష్టపోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 436.27 లక్షల కోట్లకు చేరుకుంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 92.22 వద్ద ఉంది.






