- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI రంగంలో సంచలనం.. 380 బిలియన్ డాలర్లకు చేరిన ‘ఆంథ్రోపిక్’ విలువ
కేవలం ఐదు నెలల్లోనే 380 బిలియన్ డాలర్ల రికార్డు వాల్యుయేషన్‌కు చేరుకున్న ఆంథ్రోపిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విపణిలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ప్రముఖ AI స్టార్టప్ ఆంథ్రోపిక్ (Anthropic) సంస్థ కేవలం ఐదు నెలల వ్యవధిలోనే తన మార్కెట్ విలువను రెట్టింపు చేసుకుని 380 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌కు చేరుకుంది. తాజా ‘సిరీస్ G’ ఫండింగ్ రౌండ్‌లో ఆంథ్రోపిక్ ఏకంగ 30 బిలియన్ల నిధులను సమీకరించింది. సెప్టెంబర్ 2025లో 183 బిలియన్ డాలర్లుగా ఉన్న కంపెనీ విలువ, ఫిబ్రవరి 2026 నాటికి 380 బిలియన్ డాలర్లకు చేరింది. క్లాడ్ (Claude) మోడల్స్‌కు పెరుగుతున్న ఆదరణతో కంపెనీ వార్షిక ఆదాయం (Annualized Revenue) 14 బిలియన్ డార్లకు చేరడం విశేషం..
టెక్ దిగ్గజాల పెట్టుబడులు..
AI స్టార్టప్ ఆంథ్రోపిక్ సంస్థలో ప్రముఖ టెక్ దిగ్గజాలు అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయి. సెకండరీ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్ల విక్రయం 350 బిలియన్ల వాల్యుయేషన్ వద్ద కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లలో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఆంథ్రోపిక్ ఇటీవల విడుదల చేసిన ‘Claude Cowork’ ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇవి కేవలం సమాధానాలు ఇచ్చే చాట్‌బాట్‌లు మాత్రమే కాదు, మనుషుల ప్రమేయమే లేకుండా కంప్యూటర్లలో పనులు చేయగలిగే ‘ఏజెంటిక్ ఏఐ’ టూల్స్ కావడంతో సరికొత్త సెన్సేషన్‌ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ రంగం కుప్పకూలుతుందనే ఆందోళనతో విశ్లేషకులు దీనిని ‘SaaSpocalypse’ అని అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా కోడింగ్, డేటా అనలిటిక్స్ పనులను ఇవి అత్యంత వేగంగా చేస్తుండటంతో భారతీయ ఐటీ దిగ్గజాలైన TCS, ఇన్ఫోసిస్ (Infosys) వంటి కంపెనీల షేర్లపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.
భారత్‌లో విస్తరణ..
ఆంథ్రోపిక్ తన కార్యకలాపాలను భారత్‌లోనూ వేగవంతం చేసింది. బెంగళూరులో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించి, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశంలోని ఐటీ నిపుణులు ఇకపై కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా, ఏఐ ఏజెంట్లను నిర్వహించే (AI Orchestration) నైపుణ్యాలను నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






