- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBI: చిన్న వ్యాపారాలకు అరగంటలో రూ.5 కోట్ల వరకు రుణాలిస్తున్నాం: ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి
డిజిటలీకరణ కారణంగా ఎస్ఎంఈలకు కేవలం 25-26 నిమిషాల్లో రూ. 5 కోట్ల వరకు రుణాలను ఆమోదం ఇవ్వడం పట్ల ఎంతో గర్వపడుతున్నాను.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ వినియోగం కారణంగా ఆర్థిక రంగంలో అపారమైన అవకాశాలు లభిస్తున్నాయని ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి అన్నారు. ముఖ్యంగా చిన్న వ్యాపారాలకు వేగవంతమైన, విస్తృతమైన క్రెడిట్ యాక్సెస్ అవకాశాలను మరింత ఎక్కువగా అందిస్తోందన్నారు. ప్రస్తుతం చిన్న, మధ్య తరహా(ఎస్ఎంఈ) సంస్థలకు కొన్ని నిమిషాల్లోనే రుణాలిస్తున్నాం. డిజిటలీకరణ కారణంగా ఎస్ఎంఈలకు కేవలం 25-26 నిమిషాల్లో రూ. 5 కోట్ల వరకు రుణాలను ఆమోదం ఇవ్వడం పట్ల ఎంతో గర్వపడుతున్నాను. ఎస్‌బీఐ సృష్టించిన భారీ డిజిటల్ ల్యాండ్‌స్కేప్ కారణంగానే ఇది సాధ్యమైందని బుధవారం జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ సమ్మిట్‌లో సీఎస్ శెట్టి అన్నారు. బ్యాంకింగ్ రంగంతో పాటు డిజిటలీకరణ కారణంగా ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక ఉత్పత్తుల వినియోగం పెరుగుతున్నాయి. అయితే, రానున్న రోజుల్లో యూపీఐ ద్వారా ఇచ్చే రుణాలకు సంబంధించి బ్యాంకులు రికవరీ సామర్థ్యాలను మరింత మెరుగుపరచాలని సీఎస్ శెట్టి సూచించారు. ప్రస్తుతం దీన్ని పరిష్కరించడానికి ఎస్‌బీఐ ఎస్ఎంఈలకు రుణాలివ్వడానికి యూపీఐ లావాదేవీలు, జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లింపులు, బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్‌లతో సహా విస్తృతమైన డేటా వినియోగం కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యాలను ఉపయోగిస్తోందని ఆయన అన్నారు.
ఒక్క ఎస్‌బీఐ బ్యాంకులోనే 15 కోట్ల జన్‌ధన్(జీరో బ్యాలెన్స్) ఖాతాలు ప్రారంభమయ్యాయని, అందులో 99.5 శాతం అకౌంట్లలో నగదు ఉందని సీఎస్ శెట్టి చెప్పారు. వాటిలో సగటున రూ. 4,000 చొప్పున ఒక్కో ఖాతాలో నగదు ఉంది. ఈ ఖాతాల నుంచే రోజుకు 35 లక్షల లావాదేవీలు జరుగుతున్నట్టు వివరించారు. అంతేకాకుండా మొత్తం ఖాతాల్లో 56 శాతం మహిళలవే ఉన్నాయని చెప్పారు. అలాగే, ఈ ఏడాది చివరి నాటికి ఎస్‌బీఐ మొబైల్ యాప్ యోనో 2.0 రెండవ వెర్షన్‌ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు శెట్టి స్పష్టం చేశారు. గత ఏడాది కాలంగా ఈ కొత్త వెర్షన్‌ను బ్యాంకు అంతర్గతంగా ఉపయోగిస్తోందని తెలిపారు.






