SBI Amrit Kalash: మరోసారి ప్రత్యేక ఎఫ్‌డీ 'అమృత్ కలశ్' పథకం గడువు పొడిగించిన ఎస్‌బీఐ!

by Disha Web Desk 10 |
SBI Amrit Kalash: మరోసారి ప్రత్యేక ఎఫ్‌డీ అమృత్ కలశ్ పథకం గడువు పొడిగించిన ఎస్‌బీఐ!
X

ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన స్పెషల్ ఎఫ్‌డీ పథకం 'అమృత్ కలశ్ డిపాజిట్' గడువును మరోసారి పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. రిటైల్ వినియోగదారులకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్న ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువు ఆగష్టు 15తో ముగియగా, ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టే సాధారణ ఖాతాదారులకు గరిష్ఠంగా 7.1 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ అందిస్తోంది. 400 రోజుల కాలవ్యవధితో వచ్చే ఈ స్పెషల్ ఎఫ్‌డీ పథకం రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తం డిపాజిట్లకు వర్తిస్తుంది. స్వల్ప కాలానికి పెట్టుబడి లక్ష్యం ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టిన మొత్తంపై రుణ సదుపాయం పొందే అవకాశం కూడా ఉంది. ఇక, అమృత్ కలశ్ స్పెషల్ ఎఫ్‌డీ కాకుండా మిగిలిన కాలవ్యవధులపై 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధులపై ఎస్‌బీఐ బ్యాంకు 3 శాతం నుంచి 7 శాతం మధ్య వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా 3.5 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.



Next Story

Most Viewed