Amazon, Flipkartలో అంచనాలను దాటిన Samsung అమ్మకాలు.. సరికొత్త రికార్డు

by Disha Web Desk 17 |
Amazon, Flipkartలో అంచనాలను దాటిన Samsung అమ్మకాలు.. సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: పండుగ సీజన్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు ఇచ్చిన ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నెల 23 న మొదలైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.

ఈ సేల్‌లో దక్షిణ కొరియా దిగ్గజం శామ్‌సం‌గ్ రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఇచ్చిన భారీ డిస్కౌంట్‌లతో సేల్ మొదలైన తొలిరోజు 12లక్షలకు పైగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయని కంపెనీ తెలిపింది. మొత్తంగా రికార్డు స్థాయిలో రూ.1,000కోట్లకు పైగా విలువైన స్మార్ట్ ఫోన్లు అమ్ముడైనట్లు పేర్కొంది.

ఈ సేల్‌లో అత్యధికంగా గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. గెలాక్సీ ఎం 13, గెలాక్సీ ఎం 53 5జీ, గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ ఈ 5జీ వంటి గెలాక్సీ సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఎక్కువ అమ్మకాలను నమోదు చేసినట్లు శామ్‌సం‌గ్ తెలిపింది.


Next Story

Most Viewed