Samsung: మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, ధర వివరాలు!

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే.. మంచి మంచి ఫీచర్స్ తో... మార్కెట్లోకి చాలా రకా

Samsung: మార్కెట్లోకి మరో రెండు స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్, ధర వివరాలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇప్పటికే.. మంచి మంచి ఫీచర్స్ తో... మార్కెట్లోకి చాలా రకాల ఫోన్స్ వచ్చాయి. తాజాగా మార్కెట్లోకి మరో రెండు మొబైల్ ఫోన్స్.. వచ్చేసాయి. శాంసంగ్ కంపెనీ నుంచి.. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 (Samsung Galaxy Z Fold), జెడ్ ఫ్లిప్ 7 (Galaxy Z Flip 7)పేరుతో రెండు కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ మొబైల్ ఫోన్స్... ముందస్తు ఆర్డర్లు జూలై 9 అంటే నిన్నటి నుంచే ప్రారంభమయ్యాయి. ఇక ఈనెల 25వ తేదీ నుంచి అందరికీ అందుబాటులోకి రాబోతున్నాయి ఈ రెండు కొత్త మొబైల్స్. శాంసంగ్ జెడ్ ఫోల్డ్ 7 మొబైల్ ఫోన్ 8 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ క్లోజ్ చేసినప్పుడు 6.5 అంగుళాల స్క్రీన్ కనిపిస్తుంది. ఇందులో 4400 mah బ్యాటరీ ఉంటుంది. 25W ఫాస్ట్ చార్జర్ ఈ మొబైల్ ఫోన్ కు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ మొబైల్ ఫోన్స్ స్టార్టింగ్ ధర... 1,74,999 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. రెండు లక్షల వరకు కూడా ఈ మొబైల్ రేంజ్ ఉంది.

అలాగే శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 7 మొబైల్ స్క్రీన్ 6.9 అంగుళాలు ఉంటుంది. దీని బ్యాటరీ 4300 mah గా ఫిక్స్ చేశారు. కెమెరా 50 మెగా పిక్సల్ ఉంటుంది. బ్లూ షాడో, జెట్ బ్లాక్, మింటో అలాగే కోరల్ రెడ్ కలర్స్లో ఈ మొబైల్ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ ధర 1,09,999 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. ఈ రెండు మొబైల్స్ తో పాటు గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 fe (Galaxy Z Flip FE) అనే సరికొత్త మొబైల్ కూడా లాంచ్ చేసింది శాంసంగ్.

Next Story